పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 14, 2026, గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ నాయుడు గోనెగండ్ల మండలం సంజీవయ్య సాగర్, గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కాంపౌండ్ నిర్మించాలని, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేకు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆర్ వై ఎస్ ఎఫ్ గోనెగండ్ల మండల అధ్యక్షులు రాజేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు. కాలేజీ ఆవరణంలో గడ్డి,పిచ్చి మొక్కలు ఎపుగా పెరగడంతో, పాములు ఎక్కువగా సంచరిస్తున్నాయని, వాటి సంచారంతో స్టూడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారు. మరియు గాజులదిన్నె ప్రాజెక్టు పక్కన ఉండడంతో స్టూడెంట్స్ విహారనికి వెళ్లిన సమయంలో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది కాలేజీ పక్కన పిల్లిగుండ్ల నల్లిబండ కప్పట్రాళ్ల స్టేజి లో బళ్లారి మెయిన్ రోడ్డు వరకు సౌకర్యం ఉండడంతో ఎక్కువగా వాహనాలు రాక పోకలు సాగించడం వలన వివిధ శబ్దాలు వలన విద్యార్థులు స్టడీకి సమస్యగా మారాయని, కాలేజీకి చుట్టి ప్రహరీ గోడ లేనందువలన, కాలేజీ సమయంలో విద్యార్థులు కాలేజీకి బంకు కొట్టి ప్రాజెక్టు వైపు వెళ్లి కాలయాపన చేయడం జరుగుతున్నాయని, ఈ సమస్యకు ప్రహరీ గోడ నిర్మాణమే పరిష్కారమని తెలియజేశారు. ఈ సమస్యలపై ఆర్ వై ఎస్ ఎఫ్ సమావేశం నిర్వహించుకొని ఆర్ వై ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. రంగముని నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం గోనెగండ్ల మండల ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వాము స్పందించి తక్షణమే కాంపౌండ్ నిర్మాణంకు విధులను కేటాయించాలని ఆర్వైఎస్ఎఫ్ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ వై ఎస్ ఎఫ్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.