పయనించే సూర్యుడు న్యూస్ 14 జనవరి పుల్కల్ మండల ప్రతినిది పెద్దగొల్ల విజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే పాలన నుండి సర్కారు వైద్యంతో సంతృప్తి చెంది అమితమైన సంతోషంతో పాటలు పాడే రోజుకి ప్రజా ప్రభుత్వంలోని వైద్య ఆరోగ్య చేరుకుంది
హైదరాబాద్‌ని గాంధీ ఆసుపత్రిలో అందించిన మెరుగైన వైద్య సేవలకు సంతృప్తి చెందిన మరియమ్మ సర్కార్ వైద్య సేవలపై పాట పాడి ఆకట్టుకున్నారు. మరియమ్మ భర్త వెంకటేశ్వర్లు కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ ఇటీవల గాంధీ ఆసుపత్రికి వచ్చారు. అక్కడి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. వెంటనే అవసరమైన పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేశారు. వెంకటేశ్వర్లు పూర్తిగా కోలుకొని సోమవారం డిశ్చార్జ్ అయ్యాడు. తన భర్తకు వైద్యులు తీసుకున్న మంచి వైద్యం మరియు ఆసుపత్రి వసతుల పట్ల సంతృప్తి చెందిన మరియమ్మ పాట పాడి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తు మంత్రి దామోధర రాజనర్సింహ్మకు కృతజ్ఞతలు తెలిపారు.
