ప్రభుత్వాలు పద్మశాలీల అభివృద్ధికి కృషి చేయాలి

* బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్.

పయనించే సూర్యుడు: జనవరి 14: హుజురాబాద్ కాన్స్టెన్సీ ఇంచార్జ్ దాసరి రవి : పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని, మానవ సమాజం మనుగడ కోసం అనాదిగా సేవ చేస్తున్న పద్మశాలీయులు రాజకీయంగా ఎదగాలని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కన్ సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా ఎన్నికైన పద్మశాలి సమాజానికి చెందిన నాయకులకు బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి వొడ్నాల రవీందర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జక్కని సంజయ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర జనాభాలో 28 లక్షలకు ఫైచీలకు ఉన్న పద్మశాలి కులస్తులు విద్యారంగంలో, వైద్యా రంగంలో, వస్త్ర ఉత్పత్తి రంగంలో సేవ చేస్తున్నారని, అలాగే వివిధ రంగాలలో శ్రామికులుగా ఉన్నారని, ఎంతో నైపుణ్యతతో పనిచేసే పద్మశాలీల కులస్తులు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పద్మశాలి కులానికి ఎలాంటి సహకారం లేదని 28 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ రాజకీయంగా కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండడం పద్మశాలి కుల వెనుకబాటు తనానికి నిదర్శనం అని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వారి సేవ దృక్పథం ముందుకు వచ్చి సర్పంచులుగా, ఉపసర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికైన పద్మశాలి ప్రజాప్రతినిధులకు జిల్లా వ్యాప్తంగా సన్మానాలు చేస్తున్నామని తద్వారా వారికి రాజకీయ స్ఫూర్తిని తీసుకురావడమే లక్ష్యంగా, పద్మశాలీల ఐక్యత కోసం పనిచేస్తూ ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *