
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 14 మామిడిపెల్లి లక్ష్మణ్ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం కప్ క్రీడాపోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఎస్సై సుధీర్ తెలిపారు.మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఎం కప్ క్రీడాపోటీల టార్చ్ ర్యాలీ ని రాయికల్ ఎస్సై సుధీర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలను చుడుతూ వారం రోజులపాటు కొనసాగుతుందన్నారు. యువత తమ క్రీడా ప్రతిభను కనబరచడానికి సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని ఈ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ స్థాయి యువత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. క్రీడాపోటీలకు సంబంధించిన అవగాహన కల్పించడానికి అన్ని మండల కేంద్రాలలో టార్చ్ ర్యాలీ కొనసాగుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ నాగార్జున, మండల పంచాయతీ అధికారి సుష్మ, జగిత్యాల జిల్లా డి వై ఎస్ ఓ రవికుమార్, పేట అధ్యక్షులు విశ్వప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయులు పుర్రె రమేశ్, పారిపెళ్లి గంగాధర్, బందెల శ్రీనివాస్, రాజేష్, బత్తిని భూమయ్య,కాంగ్రెస్, బిజెపి, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్, కుర్మ మల్లారెడ్డి, ఎలిగేటి అనిల్, ఆమెత్యు కబడ్డీ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కుర్మ సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యాయులు పొన్నం రమేష్, గాజంగి రాజేశం, రాపర్తి నరసయ్య, కుంబాల శ్రీనివాస్, నాయకులు మహిపాల్, దివాకర్, భూమా గౌడ్, మున్ను,రవి కాంత్, శ్రీధర్, భూమేష్, తదితరులు పాల్గొన్నారు.