1970 తర్వాత ఏజెన్సీలో స్థిరపడ్డ ముంపు మండలాల నాన్ ట్రైబల్ కి పోలవరం ప్యాకేజీ పొందే హక్కు లేదు

* ఏజెన్సీ నిబంధనకు విరుద్ధంగా పోలవరం ప్యాకేజీ పొందిన పొందుతున్న నాన్ ట్రైబల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ NCST కి ఫిర్యాదు * స్పందించిన జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి ఆదేశం

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి.14.2026 కుంజ శ్రీను భారత రాజ్యాంగంలో ఆదివాసుల చట్టాల హక్కుల రక్షణ కోసం ప్రత్యేక ఐదు ఆరు షెడ్యూల్ లను ఏర్పాటు చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టం పూర్తిగా అమల్లో ఉన్నది దీని ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా 1970 తర్వాత వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ కి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎటువంటి స్థిరాచర ఆస్తులు మరియు రాయితీలు సంక్షేమ పథకాలు పొందే హక్కు లేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ప్రకటన ద్వారా తెలిపారు ఏజెన్సీ చట్టాలు కు విరుద్ధంగా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు కింద ముంపుకు గురవుతున్నటువంటి 9 మండలాల్లో వలస నాన్ ట్రైబల్స్ చట్టానికి విరుద్ధంగా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని పోలవరం నిర్వాసితుల పేరుతోటి దండుకున్నారు అధికారులు కూడా కమిషన్లకు కక్కుర్తి పడి అర్హత లేని నాన్ ట్రైబల్స్ కి కూడా భారీ ఎత్తున పోలవరం ప్యాకేజీలు ఇప్పటివరకు ఇచ్చి ఉన్నారు, ఇంకా చాలామందికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు దీనిపై ఆదివాసి సంక్షేమ పరిషత్ పలు ఆధారాలు సేకరించి జాతీయ షెడ్యూల్ తెగల కమీషన్ న్యూఢిల్లీ వారికి ఫిర్యాదు చేయగా 1/70 చట్టాన్ని ఉల్లంఘించి షెడ్యూల్ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్ కి ఏ విధంగా ప్యాకేజీ ఇస్తున్నారో తెలియజేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఫిర్యాదు ఆధారంగా జిల్లా కలెక్టర్ కు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నోటీసు జారీ చేయడం జరిగింది అని ఆయన ప్రకటన ద్వారా తెలియజేశారు ఇప్పటివరకు నాన్ ట్రైబల్స్ కి జారీ చేసిన పోలవరం ప్యాకేజీ తిరిగి రికవరీ చేయాలని భవిష్యత్తులో ఇవ్వబోతున్నటువంటి పోలవరం ప్యాకేజీ ఇతర బెనిఫిట్స్ అన్నిటిని నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది కుంజ శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *