పయనించే సూర్యుడు, జనవరి 14 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారుపాక గాంధీనగర్ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద పరశురాం పరివార్ హిందూ సంస్థ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సర్పంచ్ శివరాం నాయక్, ఉప సర్పంచ్ కన్యధారి రమేష్ పాల్గొని ముగ్గుల పోటీల గురించి, సంక్రాంతి పండుగ మరియు పరశురాం పరివార్ చేసే కార్యక్రమాల గురించి మాట్లాడటం జరిగింది, ఈ కార్యక్రమంలో పరశురాం పరివార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్ మాట్లాడుతూ సంస్థ స్థాపించినప్పటి నుండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని, మునుముందు కూడా మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది, ఈ ముగ్గుల పోటీలలో 80 మంది పైగా పాల్గొన్నారు, వారిలో మొదటి, రెండవ, మూడవ బహుమతులతో పాటు పార్టిసిపేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పరుశురాం పరివార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి కరకు ప్రసాద్, జనసేన పార్టీ కసన అంకబాబు, శ్రీ గాయత్రి జ్యోతిష కేంద్రం దేవులపల్లి సాయి కిరణ్ శర్మ , ఆలయ అర్చకులు వెల్ది శివ సాయి శర్మగారు, వీరాంజనేయులు, శ్రీనివాసరావు, జడ్జిలు శుభశ్రీ (అడ్వకేట్), ప్రభవతీ, పరశురాం పరివార్ సభ్యులు హనుమంతు, భవానీ, శ్యామల, ప్రమీల, జయ, ఇందు, నాగలక్ష్మి, నాగ దేవి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
