పయనించే సూర్యుడు, జనవరి 14: రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ గొలుసుకట్టు నాలా పైన స్లాబువేసి నిర్మి స్తున్న భవనం పైన చర్య తీసుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో పిర్యాదు చేశారు.శేరిలిం గంపల్లి జోన్ పరిధిలో మియా పూర్ సర్కిల్, చందానగర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో నాలా పై జరుగుతున్న నిర్మా ణాన్ని వెంటనే ఆపివేయాలని, అలాగే అక్కడ నాలా ఉందని తెలిసి కూడా ప్రభుత్వ భూమి ఉందని తెలిసి కూడా పర్మిషన్ ఇచ్చిన అధికారులపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. భవనానికి ఇచ్చిన పర్మిషన్స్ ని రద్దు చేయాలని కోరుతున్నామని, వర్షాకా లంలో భారీ వర్షాల నేపథ్యంలో విపరీ తమైన వరదలు వచ్చి చుట్టుపక్కల కాలనీలు ముంపుకు గురవుతున్నాయి గతంలోనే అనేకసార్లు వరదలు వచ్చి కాలనీలు మునిగిపోయిన పరిస్థితి ఉంద నీ గుర్తు చేశారు. గంగారం చెరువు నుండి చందానగర్ మీదుగా అమీస్ పూర్ లోకి వెళ్లే గొలుసుకట్ట నాలా ఇదనీ,ఇట్టినాలా ని పూర్తిగా కబ్జా పెట్టి రెవెన్యూ, ఇరిగేష న్, జిహెచ్ఎంసి అధికారులను మభ్య పెట్టి అక్రమంగా అనుమతులు తీసుకొని భారీ భవనం నిర్మిస్తున్నారు. అలాగే ఆ భవనానికి ఎలాంటి దారి లేదు నాలాపైన అక్రమంగా స్లాబ్ వేసి దాన్ని దారిగా చూ యించి అనుమతులు తీసుకున్నారనీ పేర్కొన్నా రు.ఈ మొత్తం తతంగం పైన మీరు విచారణ చేసి అనుమతులు రద్దు చేయాలని నాలా పూడ్చి వేత పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు సిపిఎం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి సి.శోభన్,కార్యవర్గ సభ్యులు వి.మా ణిక్యం,కే. కృష్ణ ఎన్.వరుణ్లు తెలిపారు.