పయనించే సూర్యుడు న్యూస్ చండూరు జనవరి 14. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీము బారక్ చెక్కులు పంపిణీ చేశారు. చండూరు మండలంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రడ్డి ఆదేశాల మేరకు చండూరు తహసీల్ధార్ మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పేద ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోరిమి ఓంకారం ,భూతరాజు ఆంజనేయులు ,సుజావుద్దీన్ ,అబ్బగోని లింగయ్య , కావాలి సురేష్, లింగస్వామి , బుషిపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు.