రాయపల్లిలో అట్టహాసంగా ‘ఆర్పిఎల్ ‘ 6 క్రికెట్   టోర్నమెంట్

* కీ||శే||  పాలెం రామస్వామి గౌడ్ స్మారకార్థంతో నిర్వహణ * క్రీడలతోనే యువతలో క్రమశిక్షణ_ సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్ * క్రీడాకారులను ప్రోత్సాహపరిచిన గ్రామ ప్రజా ప్రతినిధులు , వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు, యువకులు, క్రీడాభిమానులు

పయనించే సూర్యుడు జనవరి 15, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజపూర్ మండలం రాయపల్లి గ్రామంలో 2026 సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఆర్పిఎల్ 6 (  ప్రీమియర్ లీగ్ ) క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారుల సందడితో, ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభం అయ్యింది. ఈ క్రీడా పోటీలకు గ్రామ సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్ , హైదరబాద్ రంజీ క్రికెట్ టీం ప్రబాబుల్స్ కి సెలెక్ట్ అయినా మహబూబ్ నగర్ కు చెందిన  లడ్డు గణేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మైదానానికి చేరుకున్న అతిథులకు క్రీడాకారులు, నిర్వాహకులు డిప్యూటీ సర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్ ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సర్పంచ్ , డిప్యూటీ సర్పంచ్  , లడ్డు గణేష్ క్రీడాకారులతో ముచ్చటించి, వారిలో అపూర్వమైన ప్రోత్సాహాన్ని నింపారు.ఈ సందర్భంగా సర్పంచ్ గాయత్రి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ , క్రీడలు యువతలో కేవలం శారీరక దృఢత్వాన్నే కాకుండా, క్రమశిక్షణ, ఐక్యత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఆర్పిఎల్ వంటి టోర్నమెంట్లు ఒక వేదికగా నిలుస్తున్నాయని, నిర్వాహకులు పాలెం ప్రవీణ్ గౌడ్ ను అభినందించడం తో పాటు మైదానంలోకి  దిగి బ్యాట్ పట్టి ఒక బంతిని ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచి మ్యాచ్ ను ప్రారంభం చేశారు.అలాగే డిప్యూటీ సర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ, మా నాన్న కీ||శే||  పాలెం రామస్వామి గౌడ్ స్మారకార్థంతో ఈ  నిర్వహణ అందరి ప్రోత్సాహం తోనే నిర్వహిస్తున్నమన్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.క్రీడాకారులు క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.గ్రామ ప్రజా ప్రతినిధులు స్వయంగా మైదానంలో సందడి చేయడంతో క్రీడాకారుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు , వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు , క్రీడాభిమానులు,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *