పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 15 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శ్రీనివాస్ నగర్ టీచర్స్ కాలనీ లో భోగి మంటలు ,సంక్రాంతి సంబరాలు ఘనముగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవోస్, గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు బోనెల గోపాల్ మాట్లాడుతూ,ఈ భోగి పండుగ సందర్భంగా మన చెడు అలవాట్లను మాత్రమే అగ్నికి ఆహుతి చేద్దాం అన్నారు. ప్రజలంతా పచ్చని మొక్కలను కాపాడి ప్రకృతిని ప్రేమిద్దాం అన్నారు.రేపటి తరాలకు ఆరోగ్యమైన భూమిని అందిద్దాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బేరి అప్పారావు, దాసరీ.శ్రీనివాసరావు, గుంట తేజేశ్వరరావు,నగిరి లక్ష్మి,జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల మధుబాబు, చైతన్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ మహేష్, పంచాయతీ అధికారి అప్పారావు, రైల్వే అధికారులు డి దామోదర్ రావు, వై శంకర్ రావు, రైల్వే యూనియన్ నాయకులు ఉమామహేశ్వరరావు, ఆర్మీ ఉద్యోగులు చింతాడ రమేష్, చంద్రమౌళి, జై రామ్, సింహాచలం,మహిళలు ,కాలనీవాసులు పాల్గొన్నారు.