
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 17 వత్సవాయి గ్రామంలో ని ఈరోజు న.సంక్రాంతి పండుగ పురస్కరించుకొని భోగి రోజున మండల కేంద్రంలోని బొగ్గవరపు వెంకటేశ్వర్లు విజ్ఞాన కేంద్రం దగ్గర ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ముందుగా వత్సవాయి గ్రామ ప్రముఖులు చిట్టూరి జనార్దన్ ముగ్గుల పోటీలను ప్రారంభించారు బహుమతుల ప్రధానం అనంతరం జరిగిన సభలో ఈ సందర్భంగా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ చిరుమామిళ్ల హనుమంతరావు మాట్లాడుతూ కేంద్రం ఆధ్వర్యంలో పోటీలు కోడిపందాలు, జూదాలు ,గుండాలకు వ్యతిరేకంగా అంతరాలు, అసమానతలు లేని సంక్రాంతి అందరూ జరుపుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు సాగర్ల కృష్ణవేణి మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం మంచి పరిణామం అని అభినందించారు ట్రస్ట్ కమిటీ సభ్యులు బొగ్గరు వెంకట రాజారావు మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం అంటే విజ్ఞానమే కాకుండా సమాజ శ్రేయస్సు సమాజం కోసం పాటుపడటం చేస్తుందని దానిలో భాగంగానే మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఏ.జి.ఎం కె.సుదర్శనం మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం నిర్మించడం మండల కేంద్రంలో గొప్ప విషయం అని విజ్ఞాన కేంద్రం ద్వారా పేద ప్రజలకు మహిళలకు రైతులకు వ్యవసాయ కార్మికులకు అందరికీ ఇది ఎంతో తోడ్పాటున అందిస్తుందని ఇటువంటి విజ్ఞాన కేంద్రం వత్సవాయి మండలంలో ఉంటం మనందరికీ శుభ పరిణామం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొగ్గవరపు రమాదేవి, కొంగర రేణుకా,స్వప్న,దీప్తి, ప్రియాంక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ట్రస్ట్ కమిటీ సభ్యులు బి.రాము కె.వెంకటేశ్వర్లు, ఎస్.శ్రీనివాసరావు నర్మనేని సుబ్బారావు కె.చిన్న వెంకటేశ్వర్లు, బిక్షం జీ వెంకటేశ్వర్లు పి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు