పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 17, తల్లాడ రిపోర్టర్ సంక్రాంతి పండుగకు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ధూపాటి భద్ర రాజు ఇంటి కి వెళ్ళి గంగిరెద్దు తో ఆటలు ఆడించి న బసవన్నలు తల్లాడ లో భోగి పండుగ సందర్భంగా భోగి మంటలతో యువత ఆటలు ఆడుతూ సంక్రాంతి పండుగ కు ముగ్గులతో ప్రతి ఇంటి ముందూ చాలా చక్కగా వేసుకొని సరదాగా కుటుంబ సభ్యులతో గడపటం జరిగింది. తల్లాడ లో మాజీ ఏఎంసి చైర్మన్ ధూపాటి భద్ర రాజు మండల ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.దేధిప్యమనంగా వెలిగే భోగి మంటలు మీకు మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. అని అన్నారు వారి ఇంటి వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో గడిపారు గంగిరెద్దుతో బసవన్నలు కొద్ది సేపు పండుగ పూట ఆడించడం జరిగింది. ఈ పండుగ వేళ ప్రతి ఒక్కరికి మంచిగా కలిసి రావాలని రైతులకు పండి పంటలతో కొత్త సంవత్సరం లో పంటలు మంచిగా పండాలని కొరుకున్నారు.