పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 17 : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకొనే క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున దాతృత్వాన్ని చాటుతున్నారు. రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చమర్తి జగన్మోహన్ రాజు ఆదేశాల మేరకు టీడీపీ మండల అధ్యక్షులు మేడికొండు రవి కుమార్ నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు కొండయ్య నాయుడు, బాపనయ్య నాయుడు, బాసినేని వెంకటేశ్వర్లు నాయుడు, ఎంపీటీసీ కేశవ, పోలి చెరువు నీటిసంఘం అధ్యక్షులు నాగినేని నాగేశ్వర్ నాయుడు, కూచివారిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు నాగినేని దివాకర్ నాయుడు, వార్డు సభ్యులు సిద్ధిక్ ఆధ్వర్యంలో శుక్రవారం డి బి ఎన్ పల్లెలో బాధిత కుటుంబానికి సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కు పంపిణీ చేశారు.