పేదలకు దుస్తులు పంపిణీ

పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 17: మండల పరిధిలోని చిన్నిల్లుగారి పల్లెలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని టిడిపి సీనియర్ నాయకులు పోలి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జి యల్లటూరు శ్రీనివాసరాజు చేతుల మీదుగా గురువారం పేద ప్రజలకు చీరలు, పంచలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు, పోలిసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *