ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

పయనించే సూర్యుడు జనవరి 17 దండేపల్లి దండేపల్లి ఎస్సీ ఎస్టీ టిఎఫ్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఎస్సీ ఎస్టీ జిల్లా అధ్యక్షులు రామ్ టెక్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సంఘ సమావేశంలో మాట్లాడుతూఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఒక్క డి ఎ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకున్నారు. మిగిలిన 5 డి ఎ లను కూడా వెంటనే విడుదల చేయాలి. ఉపాధ్యాయుల అవసరాల నిమిత్తం పొదుపు చేసిన జి.పి.ఎఫ్ సురేందర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి పదవి విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు వారికి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను కాలయాపన లేకుండా వెంటనే అందేలా చూడాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. అనంతరం 2026 క్యాలెండర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బాదావత్ ప్రకాష్ నాయక్ జిల్లా బాధ్యులు ధర్మయ్య మండల అధ్యక్షుడు గోపాల్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *