జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆశీస్సులు పొందిన కృష్ణ

పయనించే సూర్యడు / జనవరి 17/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు కాప్రా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కృష్ణ తన జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని సైనిక్‌పూరిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నుంచి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృష్ణ ను శాలువతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కృష్ణ (కిట్టు) మాట్లాడుతూ, ఎమ్మెల్యే సూచనలు తనకు మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కాప్రా డివిజన్‌లో క్రియాశీలకంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కాప్రా బిఆర్ఎస్ సినియర్ నాయకులు గోగికర్ శివకుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *