స్వీయ క్రమశిక్షణ ఉంటే రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చు.

* ఎస్ ఐ మేడ ప్రసాద్

పయనించే సూర్యుడు, జనవరి 17, బూర్గంపహాడ్ మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం ,స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని, ప్రతిఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్ ఐ మేడ ప్రసాద్ అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామలో ఎస్ పి రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు హెల్మెట్ వినియోగం, సీట్ బెల్టు ప్రాధాన్యత, గోల్డెన్ అవర్, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నియమాలను పాటించడంలో స్వీయక్రమశిక్షణ కలిగి ఉంటే ప్రమాదాలను చాలావరకు నియంత్రించవచ్చని, వీధుల్లో వాహనాలు నడిపే సమయంలో పోలీసులు ఉన్నా లేకపోయినా నియమ, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి వాహనదారుడు పాటించి తమ ప్రాణ భద్రతతో పాటు ఇతరుల భద్రతకు కూడా సహకరించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్లోడ్, ఓవర్స్పీడ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరిస్తూ తమతో పాటు కుటుంబాన్ని గుర్తుంచుకుని వాహన డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో అదనపు ఎస్ ఐ దేవ్ సింగ్, కానిస్టేబుల్స్ మంగీలాల్, వీరు, అంజనాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానవత్ నరసింహ నాయక్, వై ఎఫ్ సి హెచ్ వ్యవస్థాపకులు తేజవత్ జానకిరామ్ నాయక్, యువత గ్రామస్థులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *