పయనించే సూర్యుడు, జనవరి 17 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేము నరేందర్ రెడ్డిని వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాషిపాక యాదగిరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేము నరేందర్ రెడ్డికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డివి జన్లో పార్టీ కార్యకలాపాలు, ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సంక్షిప్తంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రయోజన పథకాలను క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు.