పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 18 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కేతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని టిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు కాంగ్రెస్ పాలనలో కేతనపల్లి కన్నీరు పెడుతుందని రామకృష్ణాపూర్ కనుమరుగు అవుతుందని బి ఆర్ ఎస్ హయాంలో ప్రారంభించిన పనులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్మశాన వాటిక డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ మహిళ భవన్ కమ్యూనిటీ భవనాలు రోడ్లు డ్రైనేజీలు నిర్మాణాలను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెడుతుందని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలో 33/11 కెవి సబ్ స్టేషన్ రోడ్లు విద్యుత్ దీపాలు ఓపెన్ జిమ్ములు చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్స్ త్రాగునీరు ఇళ్ల పట్టాలు బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిరుద్యోగులకు చేయూతనిచ్చాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలకు వాస్తవాలను చేరవేయాలని ఉద్దేశంతో గద్దె రాగడి తిమ్మాపూర్ ఆర్ఆర్ కాలనీ కేతనపల్లి రామకృష్ణాపూర్ లో బి ఆర్ ఎస్ కార్యకర్తలు కరపత్రాలు పంచుతూ ఇంటింటా ప్రచారం చేశారు ప్రచారంలో మాజీ కౌన్సిలర్ అలుగుల శ్రీలత సత్తయ్య కురుమ లక్ష్మి గురువయ్య బండారు రవీందర్ కురుమ దినేష్ నస్పూరి శివ దొంతుల అభినవ్ పుప్పాల సాయికుమార్ ముచ్చకుర్తి ఆవిష్కర్ మంత్రి జీవన్ మరియు బి.ఆర్.ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు