పయనించే సూర్యుడు జనవరి 18 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఆదోని నియోజకవర్గం లో ప్రభుత్వ స్థలాలు, భూములను పరిరక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలన ఇన్చార్జి అధికారి కి సిపిఎం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఈరన్న, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, నాయకులు గోపాల్, తిప్పన్న, వీరేష్, కృష్ణమూర్తి,తదితరులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వీరు మాట్లాడుతూ ఆదోనిలో ప్రభుత్వ స్థలాలు పరిరక్షించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటున్నారని వారు తెలిపారు. రహదారులు, వంకలు, వాగులు, స్మశాన వాటిక స్థలాలు, కొండ పరంపోగు స్థలాలు లాంటి వాటిపై కొంతమంది డేగా కన్నుతో అధికారుల సహకారంతో స్థలాలు గుర్తించి, వాటిని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా ఉన్నారని వారు తెలిపారు. అదేవిధంగా పేదలకు ఇస్తున్న ఇంటి స్థలాలు ఓకే ఇంటి పట్టాను పేర్లు మార్పుతో ఇద్దరు,ముగ్గురికి ప్రభుత్వ స్థలాలు ఇస్తూ ఒకరిపై ఒకరు గొడవలకు దారి తీసే విధంగా అధికారులు చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నత అధికారులు ఆదోని రెవెన్యూ కార్యాలయంలో ఉన్న భూ రికార్డులను ప్రక్షాళన చేస్తూ ఒకే పట్టా ఒకరికి ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులు అందరితో కలిపి తహసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళనలు నిర్వహిస్తామని వారు తెలిపారు.