పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 18 ,2026. పెరవలి/పశ్చిమగోదావరి జిల్లా రిపోర్టర్ అక్షింత్. : పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో సంక్రాంతి పండగ పురస్కరించుకుని గ్రామంలోని ప్రతి సంవత్సరం జరిగే సాంప్రదాయ వేడుకలు ఈసారి కూడా శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన వివిధ కుటుంబ సభ్యులు సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నప్పటికీ పండుగ సందర్భంగా స్వగ్రామానికి చేరుకుని ఒకే కుటుంబ సభ్యులుగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సిర్రా వారు మరియు సొంగా వారు వారి వారి ఐక్యత వెళ్లి వెరిసింది. మరియు వివిధ క్రీడలు నిర్వహించి, బహుమతులు అందజేస్తూతూ వివిధ ఉన్నతమైన రంగాల్లో పనిచేస్తున్న వారు ఆరోగ్యం పట్ల, వ్యవసాయం పట్ల, ముఖ్యంగా విద్యను అభ్యసించడం వల్ల కుటుంబ అభివృద్ధి, మంచి సమాజం ఏర్పడుతుందని ముఖ్యంగా గ్రామ అభివృద్ధికి గ్రామ ఐక్యతకు అందరూ కట్టుబడి ఉండాలని మంచి సంప్రదాయాల వల్ల మంచి సమాజం ఏర్పడుతుందని వివరించారు. అంత మాత్రమే కాకుండా సిర్రా మరియు సాంగా సంఘ సభ్యులు అందరూ వందలాది మంది హెచ్చుతగ్గులు లేకుండా ఏర్పాటు చేసుకున్న విందులో పాల్గొని ఆనందించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంఘ నాయకులు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
