పాలు సమస్యలపై మంత్రి గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన మహితపూర్ కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 18 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలంలోని మహితపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు శనివారం రోజున జగిత్యాల జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి సర్పంచ్ తలారి నాగమణి -రాజేష్ ఆధ్వర్యంలో గ్రామం లోని వార్డ్ సభ్యులు, ఉపసర్పంచ్, కాంగ్రెస్ నాయకులు దాదాపుగా (30) ముప్పై మంది కలిసి ధర్మపురి లోని మంత్రి క్యాంపు ఆఫీస్ లో గౌరవ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి వర్యులుని కలిసి మైతపూర్ గ్రామంలోని పాలు సమస్యలపై వినతిపత్రం అందించారు ఈ వినతిపత్రం లో జగిత్యాల, వేములవాడ, కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్, కరీంనగర్ రెండు పార్లమెంట్ పరిధిలోని రాయికల్, కోరుట్ల, మెడిపెల్లి మండలాను కలిపే లింక్ రహదారి బీటి రోడ్డు పోరుమాల్ల నుండి మైతపూర్ మీదుగా జోగినపెల్లి వరకు బీటి రహదారి కొరకు ఐదు కిలోమీటర్లు మంజూరు చేయగలరని అలాగే గ్రామం లోని పద్మశాలి సంఘ భవనమునకు మినీ కల్యాణ మండపంనకు అలాగే మున్నూరు కాపు సంఘ భవనం నకు నిధులు ఇవ్వగలరని తెలుపగ వెంటనే మంత్రి సంబంధిత అధికారులను పిలిచి మైతపూర్ గ్రామం నుండి వచ్చిన వినతిపత్రంలను వారికి అందించి సంబంధించిన ప్రతి పాదనలు ఎస్టిమేషన్ తయారు చేయాలనీ వెంటనే అదేషించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి తెలిపారు అలాగే మహితపూర్ గ్రామంలో నుండి కోరుట్ల డిపో బస్సు కోరుట్ల నుండి రాయికల్ నకు మరియు రాయికల్ నుండి కోరుట్ల కుపోవు బస్సులను మహితపూర్ గ్రామం లోనుండి వెళ్లే విధంగా చూడాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మంత్రి కోరుట్ల డిపో మేనేజర్ ని చరవాణి ధ్వారా మాట్లాడి వెంటనే బస్సు సమస్య ను పరిష్కరించి వెంటనే డిపో మేనేజర్ వారి సిబ్బంది మహితపూర్ గ్రామ నకు వెళ్లి రూట్ సమస్య ను పరిష్కరించి గ్రామం నకు బస్సు నడిచేలా చేయాలనీ మంత్రి అదేశించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి గ్రామ సర్పంచ్ తలారి నాగమణి రాజేష్ ఉపసర్పంచ్ దొంగ ప్రణయ్ వార్డ్ సభ్యులు అనుమల్ల రమ సత్యనారాయణ, బూస గంగామల్లయ్య, కొల్ల ప్రమీల, నేమ్మిల్లా లత, లక్ష్మణ్, బొమ్మేనా లక్ష్మి బాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి శివానందంరెడ్డి, మిట్టపెళ్లి రాజరాం, అనుమల్ల సత్యనారాయణ, మిట్టపెల్లి రామన్న, సురేందర్, కొల్ల నారాయణ, పాలడుగు మోహనరెడ్డి, ప్రభాకర్, లింగన్న, రాజారెడ్డి, వేణుగోపాల్, స్వామిరెడ్డి, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *