పయనించే సూర్యుడు న్యూస్ :జనవరి /18: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి వారి జాతర పోస్టర్ ను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. శనివారం ఆయన ఆలయ సన్నిధిలో ఈ పోస్టర్ ను ఆలయ చైర్మన్ కోరం రాజిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అంతకు ముందు ఆలయంలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శఠగోపం పెట్టి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వాహణాధికారి ఏ.సుధాకర్, ఆలయ అర్చకులు శేషం మురళీధరస్వామి, ధర్మకర్తలు రామగిరి తిరుమల, ఎం.లక్ష్మణరావు, మీస రవీందర్, తాడిచెర్ల తిరుపతి, కె.రత్నం, ఎడ్ల తిరుపతి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బస్వాగౌడ్, హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, పార్టీ నాయకులు తాడిచర్ల తిరుపతి, కవ్వ పద్మ, గట్టు తిరుపతి, గొట్టె మధు తదితరులు పాల్గొన్నారు.
