పయనించే సూర్యుడు జనవరి 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) వివిధ కళారూపాల్లో ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు ఈరోజు హైదరాబాద్ లోని ఎస్సీ ఈఆర్టి గోదావరి హాల్లో సమృద్ధి కార్యక్రమం నిర్వహించారు. అయితే రాష్ట్రస్థాయి పోటీల్లో ఫరూక్నగర్ మండలం విట్యాల జడ్.పి.హెచ్.ఎస్ హెచ్ఎం ఆవుల రవి పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. రాష్ట్రస్థాయి పోటీల్లో తెలుగు భాష గొప్పదనం గురించి వివరించడం జరిందని, తద్వారా తనకు ప్రశంస పత్రం అందజేశారని హెచ్ఎం ఆవుల రవి మీడియాకు తెలిపారు.