పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 18.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) అన్నమయ్య జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ లోకనాథం చౌడేపల్లి లో స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు ముఖ్యంగా 104 108 వాహనాలను తనిఖీ చేసి వాటిలో గల సామర్థ్యాన్ని పలు విషయాలను పైలట్లను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఆరోగ్య కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను గురించి ఏఎన్ఎం లకు వివరించారు 70 ఏళ్లకు పైబడి ఉన్న వృద్ధులను కార్యక్రమంలో భాగస్వాములు చేయాలన్నారు అనంతరం పలు రికార్డులను తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు
