పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి టౌన్ జనవరి 18 సమీయొద్దీన్) పట్టణలోని వేంపేట్ గ్రామానికి అదనంగా రెండు మహిళా సంఘాల భవనాలు మంజూరు అయిన సందర్బంగా స్థలం పరిశీలన కోసం వచ్చిన మహిళా సంఘాల సి. సి (కమ్యూనిటీ కో ఆర్డినేటర్ ) భైరి సురేఖ ని సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, వార్డుమెంబర్లు చంద్రాచారి దశకంఠరాజు, జెల్ల శ్రీనివాస్ యాదవ్ లు శాలువాకప్పి సన్మానించారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకొని అన్ని రకాలుగా మహిళలు, వారి ద్వారా గ్రామం అభివృద్ధి చెందాలని మేడం వివరించారు. అన్నివిధాలా సహాయ సహకారాలు ఉంటాయని, మహిళలందరికి పథకాల గురించి అవగాహన కల్పిద్దామని సర్పంచ్ వార్డుసభ్యులు వారికి చెప్పడం జరిగింది. కార్యక్రమంలో మహిళా సంఘాల వి ఓ ఏ లు పల్లి విజయ, జెల్ల లాస్యలు పాల్గొన్నారు..