తెలుగుఖ్యాతి దివ్యతేజం ఎన్టీఆర్ సేవలను కొనియాడిన వక్తలు

* ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి.19.2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం తెలుగుఖ్యాతిని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహోన్నత శక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని రంపచోడవరం ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు రాజవొమ్మంగి మండలకేంద్రం లో ఏపిఐఐసి డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు అధ్యక్షతన ఆదివారం తెదేపా వ్యవస్థాపకులు మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ…ఎన్టీఆర్ తెలుగు జాతికి ఒక మరువలేని చిరస్థాయి స్వరమని కొనియాడారు ఆయన అప్పటికే రాజకీయంలో ఎదురులేని శక్తిగా ఉన్న రాజకీయపార్టీలను మట్టికరిపించి తెలుగుదేశం పార్టీనిస్థాపించి ఆనతికాలంలోనే పసుపు జెండాను రెప రెపలాడించిన చరిత్ర ఆయనకే సొంతం అన్నారు ఆయన కోట్లాది తెలుగు ప్రజలకు మహిళలకు అన్నగా పెరుగాంచిన ఘనాపాటి అన్నారు ఆయన జనవరి.18.1996న ఆయన మరణించి మూడు దశాబ్దాలు గడిచినా దేశవ్యాప్తముగా ప్రాముఖ్యoగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజల హృదయాల్లో ఇప్పటికీ మారుమోగుతున్న పేరు ఆయనకే సొంతం అన్నారు తెలుగునాట ఎన్టీఆర్ సినిమా అన్న భావనకే ప్రతీకగా మారిపోయారని కొనియాడారు శ్రీరాముడు శ్రీకృష్ణుడి పాత్రలు వెండితెరపై మరే పాత్ర అయినా సాక్షాత్తు ఆవిష్కరించే తీరు చిరస్మరనీయమన్నారు ఆయా పాత్రలు తెలుగు ప్రజల సామూహిక సాంస్కృతిక చైతన్యంలో శాశ్వత కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టినట్లు పేర్కొన్నారు ఆయన కాలంలో తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పరిమితంగానే ఉన్నప్పటికీ తెలుగు భాష ఆత్మగౌరవం గుర్తింపులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినది ఆయనే అని కొనియాడారు అలాగే ఎన్‌టీఆర్ చేసిన అప్రతిహాస సాంస్కృతిక ప్రతిపాదనలు మరువ లేనివన్నారు తెలుగు ప్రజల్లో ఆత్మగౌరవాన్ని నాటి దాంతో వారికి ప్రత్యేకమైన సాంస్కృతిక మరియు రాజకీయ స్వరం లభించేటట్లు ఆయన చేసిన కృషి అమోఘం అన్నారు ఎన్టీఆర్ కన్నుమూసి ముప్పై ఏళ్ల తరువాత కూడా ఆయన చేపట్టిన అనేక చిరస్థాయి సంస్కరణలు శాశ్వతముగా అజరామరం మైనవవిగా చరిత్రలో నిలిచి పోయాయన్నారు రెండురూపాయలకే కిలో బియ్యం పథకం మహిళలకు ఆస్తి హక్కులు కర్ణాలు మున్సిఫ్‌లు వంటి సామంత గ్రామధ్యవర్తుల వ్యవస్థ రద్దు ఇంజినీరింగ్ మరియు మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సామాన్య ప్రవేశ పరీక్షల ప్రవేశపెట్టడం మండల మరియు జిల్లా పరిషత్ వ్యవస్థల ద్వారా అధికార వికేంద్రీకరణ దూరప్రాంతాలకు దూరదర్శన్ ప్రసారాల ద్వారా విద్యను చేరువ చేసిన ముందడుగు సామజిక పింఛన్లు జీడిమామిడి మొక్కలు పెంపకం ఇలా అనేకం ఆయన ప్రవేశపెట్టిన కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదుగానీ సమాజాన్ని మౌలికంగా మార్చిన విప్లవాత్మక సాధనాలు గొప్ప సంస్కరణలు అని కొనియాడారు ఆయన కేవలం ఒక నటుడు ఒక రాజకీయ ధురంధరడు మాత్రమే కాదు ఆయన ఒక ఉద్యమం ఒక సాంస్కృతిక పునర్జన్మ ఒక రాజకీయ మేల్కొలుపని సగర్వముగా తెలుగు ప్రజలు చెప్పుకునే గొప్ప శిఖరమని మహా మహోన్నత శక్తి అని కొనియాడారు పలువురు వక్తలు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజలఆరాధ్యదైవం అని కొనియాడారు అలాగే ఇటీవల కాలంలో తెదేపా జాతీయ కార్యదర్శి విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ద్వారా ఉత్తమ కార్యకర్తగా అవార్డు అందుకున్న అద్దేపల్లి చిన్నారావుకి ప్రశంసాపత్రం అందజేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు,పండ్లు పంపిణీ చేశారు అనంతరం అనారోగ్యంతో ఉన్న రాజవొమ్మంగి సీనియర్ నాయకులు జెట్టి అప్పారావు పరామర్శించారు దైర్యంగా ఉండాలని ఆత్మస్థైర్యం నింపారు ఎలాంటి ఇబ్బంది ఉన్నా తన దృష్టిలో పెట్టాలని సూచించారు కార్యక్రమంలో ఏపిఐఐసి డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు ఏ.ఎమ్.సి చైర్మన్ లోతా లక్ష్మణరావు పిఏసిఎస్ సొసైటీ చైర్మన్ ముప్పన దింబ కేశవ ఏ.ఎమ్.సి డైరెక్టర్ గట్టి మాణిక్యం నియోజకవర్గతెలుగు మహిళా అధ్యక్షురాలు ముప్పన సావిత్రి సీనియర్ నాయకులు దంతులూరి శివాజీ రాజు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్ కె.సత్య సుందరం విశ్రాంత ఉపాధ్యాయులు వజ్రపు అప్పారావు ఎమ్ మోహన్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *