పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 19.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) ప్రజలే నా దేవుళ్ళు సమాజమే నా దేవాలయం అనే మహితోక్తి తో పేద ప్రజల హృదయాలలో చిరకాలం నిలిచిన మహనీయులు మాజీ ముఖ్యమంత్రివర్యులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతిని మండల కే0ద్రమైన సోమలలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు సింగల్ విండో చైర్మన్ శివశంకర్, మహేంద్ర కుమార్ (చిన్నబాబు)పి.ఎం మల్లికార్జున, సతీష్ నాయుడు హరి నాయుడు వేణుగోపాల్ నాయుడు మని, చాణక్య, రెడ్డి పార్థసారథి,పాయల శివకుమార్ భాను ప్రకాష్ నాయుడు, అష్రఫ్ ఆలి, సదాశివయ్య మరియు మండల తెలుగు యువత అధ్యక్షుడు మహేష్ బాబు కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగిందిఈ సందర్భంగా రామారావు చేసిన సేవలను స్మరించుకుంటూ వారి యొక్క చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళులు అర్పించారు