ఆదోనిలో జేఏసీ వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆదోని జిల్లా సాధన ఉద్యమం

పయనించే సూర్యుడు జనవరి 20 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోనిలో జేఏసీ వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆదోని జిల్లా సాధన ఉద్యమం ఈ రోజుతో 64వ రోజుకు చేరుకుంది. జిల్లా సాధన లక్ష్యంగా ఈరోజు జేఏసీ నాయకులు భారీ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఆదోని పట్టణం మొత్తం మీదర్యాలీగా ముందుకు సాగుతూ ఆదోని జిల్లాను సాధించుకుంటాం” అంటూ నినాదాలతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ ర్యాలీలో జేఏసీ నేతలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనిజేఏసీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ర్యాలీ నేపథ్యంలో ఆదోనిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమంపై ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉండబోతుంది..? ఆదోని జిల్లా సాధనకు త్వరలోనే నిర్ణయం వస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *