అంబేద్కర్ నగర్ పేద ప్రజలకు ఇచ్చిన ఇంటి పట్టాలకు స్థలాలు

* హద్దులు చూపించాలని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా సిపిఎం

పయనించే సూర్యుడు జనవరి 20 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్ ఆదోని పట్టణంలో ఇంటి స్థలాల కొరకు అంబేద్కర్ నగర్ పేద ప్రజలు సుమారు 17 సంవత్సరాల క్రితం రూ 2100/- డీడీలను సుమారు 250 మంది కట్టిన వారందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని, ఇంటి పట్టాలు ఇచ్చిన వారందరికీ స్థలాలు చూపించి, హద్దులు చూపించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం తహసిల్దార్ శేషఫని కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. అనంతరం ధర్నా కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ ఈరన్న, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న నాయకులు శ్రీనివాసులు వీరు మాట్లాడుతూ 2100 రూపాయలు డీడీలు కట్టిన కొంతమందికి సర్వే నంబర్ 211, 212, ఏబిసి నందు ఈఎస్ఐ హాస్పిటల్ లేఔట్ నందు ప్రభుత్వం ఇంటి పట్టాలు 2022 సంవత్సరంలో ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. అయితే ఇంటి పట్టాలు ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంటి స్థలాలు చూపించి, హద్దులు చూపించలేకపోవడం సరైన పద్ధతి కాదని వారు తెలిపారు. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు సర్వే నిర్వహించి పట్టాలు ఇచ్చిన వారందరికీ ఇంటి స్థలాలు చూపించి, హద్దులు చూపించాలని, వారు డిమాండ్ చేశార. కావున ఇంటి పట్టాలు ఇవ్వలేని వారందరికీ వెంటనే ఇంటి పట్టాలు ఇవ్వాలని వారు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తహసిల్దార్ శేష ఫణి ప్రభుత్వమిచ్చిన ఇంటి పట్టాలకు స్థలాలు, హద్దులు చూపించి సమస్య వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ కాలనీ మహిళలు, ప్రజలు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *