ముత్యంపేట్ స్టేజి వద్ద రోడ్డు భద్రత పై అవగాహన

పయనించే సూర్యుడు జనవరి 20 దండేపల్లి రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, ఏసీబీ ఆర్ ప్రకాష్, లక్షేటి పేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో, దండేపల్లి మండలం ముత్యంపేట్ స్టేజి వద్ద దండేపల్లి ఎస్సై తహసీనోద్దీన్ సిబ్బంది ఆటో డ్రైవర్లకు వాహనదారులకు ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రైవర్లు వాహనాన్ని బయటకు తీసే ముందు సరైన ధ్రువ పత్రాలు దగ్గర ఉంచుకోవాలని వాహనాల పై స్పీడ్ గా వెళ్లకూడదని సూచించారు. ఆటో డ్రైవర్లు వాహనం నడుపుతున్నప్పుడు మద్యం సేవించకూడదని ప్యాసింజర్ల ను ఇబ్బందులు పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు వాహనాలను ఓవర్ టెక్ చేసేటప్పుడు రెండు వైపులా చూసుకొని నెమ్మదిగా వెళ్లాలని సూచనలు ఇచ్చారు. తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు మరియు కాలినడకన నడిచేవారు కూడా వాహనాలను చూసుకొని నెమ్మదిగా దాటవలెను సూచించారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుడిమేత తిరుపతి. ఉపసర్పంచ్ ఎండి.ఫయాజ్ .తోట రమణయ్య. పత్తిపాక శీను. మధు. ముత్తె బాబు. ఆటో డ్రైవర్లు ఇతర వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *