పయనించేసూర్యుడు, జనవరి 20, రామగుండం మండలం (విద్యాసాగర్): రామగుండం నియోజకవర్గం లోని ఇండ్లు నిర్మించుకునే వారికి తక్కువ ధరకే ఇసుక సప్లయి చేయాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకుర్ ఆలోచన మేరకు ఫ్రీ ఇసుక సప్లయి సోమవారం ప్రారంభమైంది. ఈ మేరకు సోమవారం గోదావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం కు చెందిన ట్రాక్టర్లు ఓనర్లు ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగ ట్రాక్టర్ అసోసియోషన్ ప్రెసిడెంట్స్ దేవేందర్ రెడ్డి,గొడుగు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకునే వారికి రూ1500లకు ఇసుక సప్లయి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు సహకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫ్రీ ఇసుక పాలసి వలన రెండు వేల మంది లేబర్ కుటుంబాలకు జీవనోపది దోరుకుందన్నారు. ప్రీఇసుక పాలసికి సహకించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకుర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రాక్టర్ ఓనర్లు మేకల పోషం మంథని శివ కుమార్, జోన్నల రమేష్, కుసుమ వేంకటేష్, కుమార స్వామి, లడ్డు యాదవ్, శ్రీధర్ తది తరులు పాల్గొన్నారు.