పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 04 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండలంలోని ఎస్సీ కాలనీకి చెందిన కోటేకల్ రాజు గడ్డివాము ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా భస్మమైంది. ఈ ఘటనతో బాధిత రైతు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి కలిసి బాధితుడికి రూ.10,000 నగదు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇలాంటి క్లిష్ట సమయంలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధితుడిని పరామర్శించారు. కార్యక్రమంలో జే. ముక్కరన్న, బి. ఆర్లప్ప, మేకల రాజు, యువరాజు, సుధాకర్, సుందరం తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.