పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 5 బోధన్ :సాలూర మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాలు 2230, 2243, 2228, 2244, 2248, 2267 సర్వే నెంబరు గల రైతులకు ఉన్నటువంటి దారితో పాటు ఎత్తిపోతల పథకం ట్యాంకులు సైతం నిరోధిస్తూ లేఅవుట్ వెంచర్ వేసుకున్న యజమాని అక్రమంగా కంచ వేసుకుని రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పిస్తున్నాడని,వెంచర్ యజమానిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన వేసిన కంచెను తొలగించి రైతులకు గతంలో ఉన్న దారిని ఏర్పాటు చేయాలని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ బుధవారం మండల ఇంచార్జ్ తహసిల్దార్ అనూష కు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కంచ ఏర్పాటుతో వ్యవసాయ కార్యకలాపాలకు పూర్తిగా అడ్డంకులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.అదేవిధంగా పంటలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వెంచర్ యజమానిపై చర్యలు తీసుకొని రైతులకు ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని రైతులు విన్నవించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ రైతుల తదితరులు ఉన్నారు.