ఉజ్వల భవిష్యత్తు కోసం కౌమార విద్యజిల్లాస్థాయి కౌమార విద్యా ఎచ్.ఐ.వి. ఎయిడ్స్. అవగాహన సదస్సులొ సింగూర్. విద్యార్థికి మొదటిస్థానం

పయనించే సూర్యుడు. న్యూస్. 5. మార్చి. పుల్కల్ మండల ప్రతినిధి పెద్దగొల్ల విజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిదిలొని సింగూర్ సాంగీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థికి ఎచ్.ఐ.వి.ఎయిడ్స్ అవగాహన సదసు కార్యక్రమంలో భాగంగా పోస్టర్ డిజైన్ తయారీ పోటీలలో మొదటి స్థానం సాధించిన సింగూర్ గురుకుల విద్యార్థి. 10 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు గల విద్యార్థులకు యుక్తవయసులో కలిగే శారీరక మానసిక మార్పులపై కౌమార విద్య ఎచ్.ఐ.వి.ఎయిడ్స్. అవగాహన కార్యక్రమం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాల విద్యార్థులకు కౌమార విద్య ఎచ్.ఐ.వి.ఎయిడ్స్. పోస్టర్ డిజైన్ తయారీ పోటీలు నిర్వహించారు. అందులో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సింగూర్ విద్యార్థి ఎ. జగన్.10.వ. తరగతి.మొదటి స్థానంలో నిలిచాడు. జిల్లా స్థాయి కౌమార విద్య పోస్టర్ డిజైన్ తయారీ పోటీలలో మొదటి స్థానంలో నిలిచిన జగన్ ను గైడ్ టీచర్ జే.సందీప్ ను పాఠశాల ప్రిన్సిపల్ గౌతమ్ ఆగమయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *