పయనించే సూర్యుడు మార్చ్ 5 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బుధవారం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా హోలీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. వివిధ పార్టీల నాయకులు యువతీ యువకులతో వ్యాపారస్తులతో కలిసి డీజే పాటలతో మైమరిచిపోయి అదిరిపోయే స్టెప్పు లేసి పలువురిని ఆకట్టుకున్న గ్రామ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్ దంపతులు. ఆనందోత్సాహంతో మైమరిచే స్టెప్పులేసి పలువురని ఆకట్టుకున్న గ్రామ ఉపసర్పంచ్ గాదేపక కిరణ్, పాలకవర్గం. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు,వ్యాపారస్తులు,యువతీ యువకులు పాల్గొన్నారు.