పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 05 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ): మండలంలో పోతులూరు గ్రామంలో ఇటీవల కాలంలో అకాల మరణం చెందినారు సూర్యారావు భార్య సత్యవతి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆ నిరుపేద కుటుంబానికి 5వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసి ఆ నిరుపేద కుటుంబానికి ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు, నరసాపురం పార్లమెంటు పరిశీలకులు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణంరాజు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోతులూరు సర్పంచ్ బొండి రాంబాబు, శెట్టి సత్తిబాబు, ఎంపీటీసీ ముప్పిడి ఏసుబాబు, చెక్కపల్లి నాగేశ్వరరావు, ఎలుగుబంటి బాబ్జి, మాజీ ఉప సర్పంచ్ పంచాది చంటిబాబు, మాజీ ఎంపీటీసీ రేఖ కృష్ణ, చీప్ది నాగేశ్వరరావు, ముప్పిడి కృష్ణ, మాది నాగేశ్వరరావు, పలివెల రామ్మోహన్, కోలా తాతబాబు, యాళ్ల ఏసు, దాడి పుత్రయ్య, అంబటి గణేష్, వైస్సార్సీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.