లైన్మెన్ దినోత్సవం ఘనంగా నిర్వహణ – చింతకాని, నాగులవంచ సెక్షన్‌లలో విద్యుత్ సిబ్బందికి సత్కారం…

పయనించే సూర్యుడు మార్చి 05 ,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). లైన్మెన్ దినోత్సవం సందర్భంగా చింతకాని మరియు నాగులవంచ విద్యుత్ సెక్షన్‌లలో ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. సెక్షన్ తరపున నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యుత్ సరఫరా నిర్వహణలో విశేష సేవలు అందిస్తున్న లైన్మెన్లు, సిబ్బందిని అభినందించారు.ఈ సందర్భంగా విద్యుత్ ప్రమాదాల నివారణపై ఉద్యోగులు మరియు వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ తీగలు తెగిపడినప్పుడు దగ్గరికి వెళ్లకూడదని, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలు జరిగిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.కార్యక్రమంలో ఏఈ ఎలక్ట్రికల్ శ్రీధర్, చింతకాని మరియు నాగులవంచ ఎస్‌ఎల్‌ఐ యస్ వెంకటేశ్వరరావు, ఎల్‌ఐలు రాంబాబు, సూర్యమోహన్, శ్రీనివాసరావు, ఎల్‌ఎం శ్రీనివాసచారి, ఏఎల్‌ఎంలు లువేణు, వీరన్న, కిషోర్ తదితర విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.ఎండ, వర్షం, రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్న లైన్మెన్ల సేవలను అధికారులు ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *