సింగనపల్లిలోసొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

* స్వర్గీయ దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి జ్ఞాపకార్థంతో

పయనించే సూర్యుడు మార్చి 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి. మెట్ట ప్రాంతమైన మర్రిపాడును అభివృద్ధి చేసింది మా కుటుంబమే. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో త్రాగునీటి సాగునీటి కోసం సోమశిల హై లెవెల్ కెనాల్ తీసుకొచ్చింది మా నాన్నగారైన మేకపాటి రాజమోహన్ రెడ్డి. మర్రిపాడులో హై లెవెల్ కెనాల్ విషయంలో ల్యాండ్లను తారుమారు చేసింది ఈ ప్రభుత్వమే. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కామెంట్స్.అధికారంలో ఉన్న లేకపోయినా ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాలను మా సొంత నిధులతో అభివృద్ధి చేస్తాము.కూటమి ప్రభుత్వం గడిచిన 22 నెలల్లో హై లెవెల్ కెనాల్ పనులు శూన్యం. నియోజకవర్గంలో ఎక్కడ పట్టిన ఇసుక మైనింగ్ అక్రమాలు ఎక్కువ అవుతున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిదే. 17 మెలికలు కాలేజీలు, పది ఫిషింగ్ హార్బర్ తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మా కుటుంబం పై వేలెత్తి చూపే నాయకులు లేరు. మర్రిపాడు డంపింగ్ లో ఉన్న ఇసుక కొండను మంత్రి కాకముందే మాయం చేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *