చిన్న పేరు తాండలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు

* హోలీ సంబరాల్లో గ్రామ సర్పంచ్ మునిందర్

పయనించే సూర్యుడు మార్చి 5 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ చిన్న పేరు తాండ గ్రామపంచాయతీ పరిధిలో హోలీ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా, ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి. ప్రకృతి సిద్ధమైన రంగులను ఉపయోగిస్తూ గ్రామస్తులందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోదరభావంతో పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ మునీందర్, ఉప సర్పంచ్ మీటియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ నాయకులు గోవింద్, మంగీలాల్, దీపక్, గోపాల్ తదితరులు పాల్గొని గ్రామస్తులతో కలిసి రంగుల హోలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మునీందర్ మాట్లాడుతూ, గ్రామంలో ఐకమత్యం, స్నేహభావం పెంపొందించేలా పండుగలు జరగడం ఆనందదాయకమని తెలిపారు. తాండ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకల్లో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *