పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 5 బోధన్ :హోలీ పండుగను పురస్కరించుకొని బుధవారం సాలురా మండలం హున్సా గ్రామంలో ఆనవాయితీని అనుసరిస్తూ గ్రామ ప్రజలు అట్టహాసంగా పిడుగుద్దులాటను నిర్వహించారు.గ్రామంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రంగులు పోసుకొని హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు.అనంతరం గ్రామంలో కుస్తీ పోటీలను జరిపారు.కుస్తీ పోటీలు ముగిసిన తర్వాత గ్రామస్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు గ్రామ పొలిమేర వద్దకు వచ్చారు.పది నిమిషాల పాటు పిడుగుద్దులాట నిర్వహించారు.పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.పొలిమేరలో ఇరువైపులా కట్టెలను పాతి పొడవాటి తాడును కట్టారు.తాడుకు రెండు వైపులా గ్రామ ప్రజలు నిలుచుని ఆనవాయితీ ప్రకారం పిడికిలి బిగించి ఒకరికి ఒకరు కొట్టుకున్నారు.ఆనవాయితీ కొనసాగడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.పిడిగుద్దులాట ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.పిడిగుద్దులాటను తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ప్రజలు భారీగా తలలి రావడంతో గ్రామంలో సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.