ఆంజనేయస్వామి ఆలయానికి భూమి పూజ

* గొల్లపల్లి సర్పంచ్ నేతుల చంద్రమోహన్

పయనించే సూర్యుడు భీమదేవరపల్లి మార్చ్ 5 :- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ నేతుల మోహన్ ఆంజనేయస్వామి ఆలయానికి బుధవారం భూమి పూజ చేశారు. సర్పంచ్ చంద్రమోహన్ మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక మేరకు గ్రామానికి ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి భూమి విరాళంగా ఇచ్చిన దాతలు హెల్ది రాజయ్య ,బొందయ్య సర్పంచి కోరిక మేరకు భూమి విరాళం ఇవ్వడంతో పూజ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉసకోయిల ప్రకాష్, ముల్కనూర్ ఎస్సై రాజు, వంగర ఎస్ఐ దివ్య, సుహాసిని, వీరభద్ర నగర్ సర్పంచ్ కొర్ర గోపాల్ నాయక్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *