వాణి హై స్కూల్లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

పయనించే సూర్యుడు, మార్చి 5, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండల కేంద్రంలోని వాణి హై స్కూల్లో మంగళవారం స్వయం పరిపాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారిగా ఎండీ సహారా, ఉప విద్యాశాఖ అధికారిగా యం శ్రీనాథ్, ఎంఈఓ గా కక్కర్ల అక్షయ, ప్రిన్సిపాల్ గా గుంటుపల్లి సాత్విక, కరస్పాండెంట్ గా యం. సాకేత్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ చేతుల మీదుగా బహుమతిలు ప్రదానం చేయటం జరిగింది. ఇందులో హై స్కూల్ స్థాయిలో మొదటి స్థానము యన్ దీక్షిత ద్వితీయ స్థానంలో బి. దీప్తి మరియు భాషా విభాగములో యస్. నాగదుర్గ ప్రథమ, ద్వితీయ స్థానంలో ఉప్పలోజు వర్షిత, ప్రైమరీ స్థాయిలో పీ. మధుప్రియ ప్రథమ వై. భవ్యశ్రీ ద్వితీయ స్థానం మరియు ఆప్షనల్ విభాగంలో సిహెచ్. ఉపేక్ష ప్రథమ జి. రితిక ద్వితీయ స్థానం అలాగే ప్రీ ప్రైమరీ విభాగం లో ప్రథమ కే. అఖిరానందన్ అలాగే ఏ. శ్రీజ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుమలత మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం ద్వారా పిల్లలో నాయకత్వ లక్షణాలు పెంపందమే కాకుండా బాధ్యతాయుత పౌరులుగా తయారు కావటం జరుగుతుంది అని తెలియచేసారు . ఇందులో న్యాయ నిర్ణేతలుగా బి. పృథ్వీరాజు ఎస్ ఏ ఇంగ్లీష్ జడ్ పి ఎచ్ ఎస్, బచ్చన్నపేట, ఎస్ బాబు, సీ ఎచ్ స్వాతి ఉపాధ్యాయులు వాణి హై స్కూల్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని వారి పిల్లల భోదనను ఆసక్తిగా తిలకించారు. అలాగే స్కూల్ ఉపాధ్యాయులు శ్వేత, షారూక్, సంధ్య,సరళ, కావ్య, స్వప్న, అనూష, శశికళ, పద్మ, రజిత, రోజా,మౌనిక పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *