పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 05 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ తహసీల్దార్ గీతా ప్రియదర్శినికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబాలను పోషించడం తీవ్రంగా కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలను పెంచి తమను ఆదుకోవాలని కోరారు. అలాగే సేవా నిబంధనలు మెరుగుపరచడంతో పాటు పదోన్నతులు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వీఆర్ఏలు తహసీల్దార్‌ను కోరారు.