సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ కార్మికులకు కాకి యూనిఫామ్ ఇవ్వాలి

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-05 సింగరేణి భూపాలపల్లి డివిజన్ లో ప్రవేట్ సెక్యూరిటీ కార్మికులకు కాకి యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏ వెంకన్న కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణిలో ప్రైవేటు సెక్యూరిటీ కార్మికులకు వివిధ కాంట్రాక్టర్స్ మారినప్పుడు వారి యొక్క కోడుతో రకరకాల యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుందని, దీనివల్ల కార్మికులు ఆర్థికంగా నష్టపోవటంతో పాటు విధి నిర్వహణలో దొంగలు కూడా వీరిని చూసి భయపడే పరిస్థితి లేదు కాబట్టి ఈ కార్మికులకు కాకి యూనిఫామ్ అందరికీ అమలయ్యే విధంగా సింగరేణి యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకోని ఖాకీ యూనిఫామ్ అమలు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మారం రామ్ రెడ్డి, మేకల సతీష్,జిట్ట వేణి శంకర్, జోరు నరేష్, జిట్ట వేణి సదయ్య, కే కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *