అశ్వ వాహనం పై కల్కి అవతారం : శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 05.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవములులో భాగంగా ఎనిమిదవ రోజు సాయంత్రం స్వామి వారు అశ్వ వాహనం పై కల్కి అవతారం లో పుర వీధులలో తిరుగుతూ భక్తులను కటాక్షించారు.. వాహనం ముందు మంగళ వాయిద్యాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి భజన కోలాట బృందాలు భజన, కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఆలయంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ వారి సంగీత కార్యక్రమాలు వీనుల విందుగా, శ్రావణానందకరంగా సాగుతున్నాయి.. ఉదయం మరియు సాయంత్రం ఆలయంలో విశేష హోమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.. పుర వాసులు అడుగడుగున స్వామి వారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆలయంలో ఉదయం సాయంత్రం అన్నప్రసాద వితరణ గావిస్తున్నారు.. కృష్ణ మూర్తి
ఆలయ ఇన్స్పెక్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *