ప్రధానమంత్రి సురక్ష బీమా చెక్కు అందజేత

పయ నించే సూర్యుడు 05-03-2026 మార్చినాలుగు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, ప్రధానమంత్రి సురక్ష బీమా బీమా యోజన (పి ఎం ఎస్ బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 20 రూపాయలు చెల్లించడం ద్వారా పడవ ములిగి మరణం పొందిన ఖాతాదారునికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తుందని కాట్రేనికోన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జి బి వి రమణ తెలిపారు. కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన కొప్పడి మహేష్ ఇటీవల మరణించగా ఆయన భార్య కొప్పడి మంగ కి రెండు లక్షల రూపాయల బీమా చెక్కును బుధవారం మేనేజర్ అందించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ జీవిత బీమా, ప్రమాద బీమా పాలసీ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ మహేష్ బాబు,జి విజయ్ కుమార్, ప్రశాంత్ ఇంకా స్టేట్ బ్యాంక్ సిబ్బంది, కియోస్క్ బ్యాంక్ ఆపరేటర్లు పెయ్యల సురేష్ బాబు, పాలెపు సత్యానందం , మల్లాది రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *