ఎన్‌ఎంఎంఎస్ ఫలితాల్లో మాసంపల్లి శివ ప్రతిభ

పయనించే సూర్యుడు మార్చి 6 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ 2025) ఫలితాల్లో జనగామ జిల్లా దేర్పుల మండలం లోని కడవేండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మాసంపల్లి శివ అద్భుత ప్రతిభ కనబరిచాడు. 180 మార్కులకు నిర్వహించిన ఈ విశ్లేషణాత్మక పరీక్షలో శివ ఉత్తమ మార్కులు సాధించి స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాడు. ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థికి 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఏడాదికి ₹12,000 (మొత్తం ₹48,000) చొప్పున కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనం అందించనుంది. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో శివను హెచ్‌ఎం డాక్టర్ ఎన్ ఎన్ రాజు, ఉపాధ్యాయులు కొంగ వెంకటేశ్వర్లు, వైట్ల మోహన్, కాసాని ప్రభాకర్, గంగిశెట్టి శ్రీనివాస్, గొల్లూరి శీను, అభినందించారు. గ్రామానికి పేరు తెచ్చినందుకు గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *