అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ శిరిడి పుష్కర ద్వారకా దత్త సాయి మందిరం 9వ వార్షిక మహోత్సవం

* భక్తజన సందోహంతో కిటకిటిలాడిన దత్త సాయి మందిరం * ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి నామ సంకీర్తనలతో మారుమోగిన ఆలయ ప్రాంగణం

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 06,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రత కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాకలోని శ్రీశ్రీశ్రీ శిరిడి పుష్కర ద్వారకా దత్త సాయి మందిరం 9వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఆలయ కమిటీ వారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 5:15 నిమిషాలకు కాకడ హారతి, 6:00 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సాయినాధునికి పంచామృతాలతో రుద్రాభిషేకము, నూతన వస్త్రాలంకరణ, నీరాజనం, మంత్రపుష్పము, గోత్రనామ అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి, దత్త సాయి ,మహా మృత్యుంజయ సహిత దుర్గ పాశుపత, నవగ్రహ హోమములు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది, అనంతరం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు, భక్తజన సందోహంతో మందిర ప్రాంగణం కిటికీటలాడిది, ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి నామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది, భక్తులు ఆనందంతో నృత్యం చేశారు. సాయంత్రం ఐదు గంటలకు అంగరంగ వైభవంగా బాజా భజంత్రీలతో భక్తుల ఆనంద కోలాహాలతో ,సాయి పల్లకి సేవ మహిళా భక్తుల కోలాట బృందం మంచిర్యాల వారిచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీశ్రీశ్రీ ద్వారక దత్త సాయి వారి రథోత్సవ కార్యక్రమం సారపాక పురవీధుల్లో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆ సాయిబాబాని నమ్ముకుంటే కష్టాలు దరి చేరవని, కోరిన కోరికలు తీరుతాయని ,అంతా మంచే జరుగుతుందని సాయిబాబా వారి అనుగ్రహంతో అందరికీ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. మంచిర్యాల నుండి వచ్చిన కోలాటం బృందం వారికి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ శ్రీ శ్రీ షిరిడి పుష్కర ద్వారక దత్త సాయి మందిరం తొమ్మిదో వార్షికోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ మా ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు, శ్రీశ్రీశ్రీ శిరిడి పుష్కర ద్వారా మందిరానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఆలయ పూజారి సంతోష్ శర్మ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి వస్తు రూపేనా ధన రూపేనా సహాయ సహకారాలు అందించి ఆలయ ఆలయ అభివృద్ధిలో పాల్పంచుకోవాలన్నారు ఆలయ అభివృద్ధికి సహకరించాలనుకున్న భక్తులు( దాతలు) ఈ 9963666859 నెంబర్ ను సంప్రదించి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా సహకరించగలరన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *