పయనించే సూర్యుడు మార్చి 06 ధర్పల్లి మండల రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి మండల కేంద్రంలోని కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ ధర్పల్లి మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, వార్డ్ మెంబర్ నిమ్మల వినయ్ గౌడ్ ని ఆహ్వానించి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికులకు గీతా కార్మిక పెన్షన్ వచ్చే విధంగా చూడాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.